- వైద్య విద్యార్థిని పట్ల అసభ్యకర ప్రవర్తన..
- తప్పించుకుని పారిపోయిన స్టూడెంట్..
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన..
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో ఓ కీచకుడి బాగోతం బట్టబయలైంది. మహిళా వైద్య విద్యార్థులకు రక్షణగా ఉండాల్సిన ఓ నర్సింగ్ ఆఫీసర్ కామంతో కల్లు మూసుకుపోయి దారుణానికి ఒడిగట్టాడు. ఓ అర్థరాత్రి రిమ్స్ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో విధులు ముగించుకుని హాస్టల్ కు వెళ్లేందుకు సిద్దమైన ఓ వైద్య విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
ఆపరేషన్ థియేటర్ డోర్లు మూసివేసి ఆ జూనియర్ డాక్టర్ పై దారుణానికి యత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన వైద్య విద్యార్థిని పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఆ కామాంధుడి చెర నుండి బయటపడి ఆస్పత్రి బయటకు పరుగులు తీసింది. ఈ షాకింగ్ ఘటనతో ఆదిలాబాద్ రిమ్స్ వైద్య విద్యార్థి లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన వారం రోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
మే నెల 8వ తేదీన అర్థరాత్రి ఓ వైద్య విద్యార్థిని రిమ్స్ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో విధులు ముగించుకుని హాస్టల్ కు వెళ్లేందుకు సిద్దమైంది. ఇదే సమయంలో ఆ ఆపరేషన్ థియేటర్ రూంలో మేల్ స్టాప్ నర్స్ గా విధులు నిర్వహిస్తున్న కోటేవార్ సాయిరాం అనే నర్సింగ్ ఆఫీసర్ అసభ్యంగా ప్రవర్తించాడు. భోజనం చేస్తారంటూ మాటలు కలిపి తాకరాని చోట తాకేందుకు యత్నించాడు.
ఈ హఠాత్తు పరిణామంతో షాక్ కు గురైన వైద్య విద్యార్థిని పెద్ద పెద్ద గా కేకలు వేస్తూ బయటకు పరుగెత్తింది. ఆపరేషన్ థియేటర్ డోర్ పెట్టి ఆ వైద్య విద్యార్థిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు ఆ నర్సింగ్ ఆఫీసర్. ధైర్యంగా ఆ కామాంధుడిని తోసుకుంటూ ఆస్పత్రి జనరల్ వార్డ్ లోకి పరుగులు తీసింది ఆ వైద్య విద్యార్థిని. ఈ విషయం తెలుసుకున్న తోటి జూడాలు ఆ నర్సింగ్ ఆఫీసర్ పట్టుకునే ప్రయత్నం చేయగా ఆస్పత్రి నుండి పరారయ్యాడు. Hemavati Temple, Siddheshwara Swamy
