కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ ను నిరసిస్తు మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల నరేష్ మాట్లాడుతూ పేపర్ లీక్ విషయంలో మోదీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య పూరితంగా వ్యాహరిస్తుందని అన్నారు.

పేపర్ లీక్ చేసిన దోషులను వెంటనే చట్ట పరంగా శిక్షించి, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు,మాజీ కౌన్సిలర్లు, సర్పంచ్లు , ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ మండల , పట్టణ అధ్యక్షులు , నాయకులు, మహిళా నాయకురాలు,యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
