- ఒక వ్యక్తిని ఇంజన్ లోకి లాగేసుకున్న ఎయిర్ బస్..
- ఇంజిన్ నుంచి భారీగా వెలువడ్డ మంటలు..
కంచె దాటి ఎయిర్‌పోర్టులోకి వచ్చిన ఓ వ్యక్తి రన్‌వే దాటుతుండగా.. ఓ భారీ ఎయిర్‌బస్ ఏ-321 విమానం అతడిని ఇంజిన్‌లోకి లాగేసుకుంది. అమెరికా లోని కొలరాడోలో ఈ ఘటన చోటుచేసుకొంది. స్థానిక డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లో ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ఓ వ్యక్తి హఠాత్తుగా కంచె దూకి రన్‌వేకు అత్యంత సమీపంలోకి వచ్చాడు. దాంతో అతడిని విమానం ఇంజిన్ ఒక్కసారిగా లోపలకు లాగేసుకోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.
అతడి శరీరం పైభాగం ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది. ఇంజిన్ నుంచి భారీగా మంటలు వెలువడ్డాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానం గంటకు 139 మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. విమానం లోపల కూర్చున్న ప్రయాణికులకు ఇంజిన్‌లో నుంచి మనిషి కాళ్లు కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇంజిన్ నుంచి భారీ శబ్దాలు వినిపించడంతోపాటు మంటలు వెలువడ్డాయి. దాంతో విమానం టేకాఫ్‌ను నిలిపేసి ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా కిందకు దించేశారు.
