Monday, May 11, 2026
Homeరంగారెడ్డిShadnagar | భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలి.

Shadnagar | భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలి.

  • షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.
  • ఘనంగా మాజీ ఎంపిటిసి చంద్రపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు.

పార్టీలో కష్టపడే నాయకులకు భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు లభిస్తాయని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. నందిగామ మాజీ ఎంపిటిసి, యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు బండారు చంద్రపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శాలువలతో సన్మానించి,స్వీట్లు తినిపించి చంద్రపాల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో కష్టపడే వారికి మంచి అవకాశాలు తప్పకుండా లభిస్తాయని అన్నారు.ఎవ్వరు నిరాశ చెందవద్దన్నారు. పార్టీ కోసం మీ పని మీరు చేయండి అవకాశాలు అవే లభిస్తాయని చంద్రపాల్ రెడ్డిని ఆశీర్వదించారు.శంషాబాద్ లో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి తన నివాసంలో చంద్రపాల్ రెడ్డిని శాలువలతో సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. భవిష్యత్తులో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఉన్నతమైన పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News