Saturday, May 9, 2026
Homeబిజినెస్Expansion | తెలంగాణాలో బంధన్ బ్యాంకు శాఖలు..

Expansion | తెలంగాణాలో బంధన్ బ్యాంకు శాఖలు..

  • వ్యాపార విస్తరణకు ముందడుగు..
  • హైదరాబాద్ లో రెండు బ్రాంచిల ఏర్పాటు..

తెలంగాణలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి ఒకేసారి మూడు శాఖలను ప్రారంభించింది బంధన్‌ బ్యాంక్‌. వీటిలో హైదరాబాద్‌లో రెండు శాఖలను ఆరంభించిన సంస్థ..మరొకటి మిర్యాలగూడలో నెలకొల్పింది. దీంతో తెలంగాణలో శాఖల సంఖ్య 162కి చేరుకున్నాయి. తమిళనాడులో ఐదు, కేరళ, కర్ణాటక రాష్ర్టాల్లో చెరో రెండు చొప్పున ప్రారంభించినట్లు బంధన్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈవో పార్థ ప్రతీమ్‌ సేన్‌గుప్తా తెలిపారు. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో ఈ కొత్త శాఖలను ప్రారంభించినట్టు, తద్వారా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి వీలు పడనున్నదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News