- వేసవిలో చాలామంది ఇష్టపడతారు..
- ప్రాసెస్ చేయని చేరుకురసం మంచిది..
వ్యాయామం చేసిన తర్వాత శరీరానికి తక్షణ హైడ్రేషన్, శక్తి అవసరం ఉంటాయి. ముఖ్యంగా వేసవిలో దేశంలో చాలా మంది సహజంగా చెరకు రసం వైపు మొగ్గుతారు. ఇది చల్లగా, తాజాగా ఉండి వెంటనే శక్తిని అందించినట్టు అనిపిస్తుంది. కానీ ఇది నిజంగా ఆరోగ్యకరమైన పోస్ట్ వర్కౌట్ డ్రింకేనా? లేకపోతే కేవలం చక్కెర ఎక్కువగా తీసుకుంటున్నామా? అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి.
చెరకు రసం కేవలం చక్కెర మాత్రమే కాదు. ఇది ప్రధానంగా నీరు, సుక్రోజ్‌తో తయారవుతుంది. ఇదే సుక్రోజ్ ను సాధారణ టేబుల్ షుగర్ తయారీలో ఉపయోగిస్తారు. అయితే ప్రాసెస్ చేయని చెరకు రసం ఒక ముఖ్యమైన విషయంలో భిన్నంగా ఉంటుంది. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, ఇందులో ఫెనోలిక్, ఫ్లేవనాయిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి కొంతమేర ప్రయోజనాలను అందిస్తాయి.
