- ఇక మీకు డాక్టర్ తో పని ఉండదు..
రాత్రి పూట త్వరగా భోజనం చేస్తే శరీరంలో నిజంగా ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది ఇది కేవలం ఆకలి తగ్గడానికే సహాయపడుతుందని భావిస్తారు. కానీ శరీరంలో జరిగే మార్పులు అంతకంటే చాలా పెద్దవిగా ఉంటాయి. నిద్రకు ముందు పొట్టకు సరైన విశ్రాంతి ఇచ్చినప్పుడు, శరీరం జీర్ణక్రియపై కాకుండా రిపేర్ (పునరుద్ధరణ) పనులపై దృష్టి పెడుతుంది. దీని వల్ల గట్ (జీర్ణ వ్యవస్థ) రిథమ్ నుంచి నిద్ర ప్యాటర్న్స్ వరకు అనేక మార్పులు జరుగుతాయి.
రాత్రిపూట త్వరగా తినడం వల్ల శరీరంలో జరిగే మార్పుల గురించి వైద్యులు వివరిస్తున్నారు. మొదటగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో కూడా పని చేస్తూనే ఉంటుంది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది, ఆమ్లత్వం (ఆసిడిటీ) పెరుగుతుంది.
