Sunday, April 19, 2026
Homeబిజినెస్Yamaha | యమహా నుంచి కొత్త బైక్..

Yamaha | యమహా నుంచి కొత్త బైక్..

  • ఫేస్మినో 125 ఎఫ్ ఐ హైబ్రిడ్ మోడల్..
  • ప్రారంభ ధర రూ. 76,500 గా నిర్ణయం..

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్‌ మరో స్కూటర్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఫాస్కినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌ మాడల్‌ ప్రారంభ ధర రూ.76,500గా నిర్ణయించింది. డిస్క్‌ బ్రేక్‌ కలిగిన మాడల్‌ ధర రూ.88 వేలు కాగా, టాపెండ్‌ మాడల్‌ రూ.95,200. ఇప్పటికే ఇలాంటి స్కూటర్లు దేశవ్యాప్తంగా 15 లక్షలకు పైగా ఉన్నాయి.

తాజాగా విడుదల చేసిన ఈ మాడల్‌ను మరింత ఆధునీకరించి, టెక్నాలజీ పరంగా భారీ మార్పులు చేసినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 125 సీసీ ఇంజిన్‌తో తయారైన ఈ స్కూటర్‌ ఎయిర్‌-కూల్డ్‌, సైలెంట్‌-స్టార్‌ టెక్నాలజీతో తీర్చిదిద్దింది. 2015లో 110 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్‌తో ప్రవేశపెట్టిన సంస్థ..ఆ తర్వాతి క్రమంలో దీనిని 125 సీసీకి పెంచింది. యమహా తన తొలి హైబ్రిడ్‌ స్కూటర్‌ను 2021లోనే ప్రవేశపెట్టింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News