Tuesday, April 14, 2026
Homeఆదిలాబాద్పోలీసు అక్క శివంగి టీంలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తాం

పోలీసు అక్క శివంగి టీంలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తాం

నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ అక్క, శివంగి టీంల తరహా బృందాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ‘పోలీసు అక్కలతో మాట-ముచ్చట’ కార్యక్రమంలో ఆయన పాల్గొని, పోలీసు అక్కలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. మహిళా భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ బృందాలను ఏర్పాటు చేసిన ఎస్పీ జానకి షర్మిలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ బృందాలు చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News