Tuesday, March 31, 2026
HomeతెలంగాణKaushik Reddy | నన్ను అకారణంగా వేధిస్తున్నారు..

Kaushik Reddy | నన్ను అకారణంగా వేధిస్తున్నారు..

  • ఆవేదన వ్యక్తం చేసిన పాడి కౌశిక్ రెడ్డి..

తనకు సీఐడీ నోటీసులు అందడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కక్షతోనే తనను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. “రేవంత్ రెడ్డి గారు… నన్ను లక్ష్యంగా చేసుకోండి, నాపై ఎన్ని కేసులైనా పెట్టండి, నోటీసులు ఇవ్వండి. కానీ నా కుటుంబాన్ని, మా బీఆర్‌ఎస్ కుటుంబ సభ్యులను ఈ గొడవల్లోకి లాగి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం?” అని ప్రశ్నించారు. ఏ తప్పు చేయకపోయినా కావాలనే వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని బెదిరింపులకు గురిచేసినా తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. “ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు, ప్రజల కోసం చేస్తున్న పోరాటం. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాను” అని హెచ్చరించారు. ప్రశ్నించే గొంతును అధికార బలంతో అణచివేయలేరని, ప్రజల పక్షాన తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని అన్నారు.

- Advertisement -

జనవరి 29న హుజూరాబాద్‌ నియోజకవర్గం వీణవంకలో జరిగిన మినీ మేడారం జాతర సందర్భంగా పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో, ఆయనపై కేసు నమోదయింది. ఈ క్రమంలో, ఏప్రిల్ 4న విచారణకు హాజరుకావాలని సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News