Tuesday, March 24, 2026
Homeమెదక్‌Jatara | జగ్గంపేటలో వైభవంగా నల్ల పోచమ్మ జాతర

Jatara | జగ్గంపేటలో వైభవంగా నల్ల పోచమ్మ జాతర

  • తొలిరోజు గ్రామ దేవత నల్ల పోచమ్మకు బోనం సమర్పణ
  • మూడు రోజుల పాటు జరగనున్న జాతర మహోత్సవం

శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి అనుగ్రహం, కృపాకటాక్షాలతో భక్తజనం సుఖఃసంతోషాలతో వర్థిల్లాలని చిలిపిచేడ్ మండలం జగ్గంపేట గ్రామ సర్పంచ్ స్రవంతి రాందాస్ గౌడ్ ఆకాంక్షించారు.జగ్గంపేట గ్రామంలో మూడు రోజుల పాటు నిర్వహించే గ్రామ దేవత నల్లపోచమ్మ తల్లి జాతరలో భాగంగా సోమవారం మొదటి రోజున అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమం వైభవంగా ప్రారంభించారు.గ్రామంలోని ప్రతీ ఇంటి నుంచి బోనాన్ని ఎత్తుకొని మహిళలు ఆలయానికి బయల్దేరి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు.

శివసత్తుల పూనకాలు,పోతురాజుల విన్యాసాలు, యువకుల కేరింతల మధ్య బోనాలు,తొట్టెల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులంతా పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా వారు గ్రామంలో వర్షాలు బాగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లేలా చూడాలని బోనాల నైవేద్యాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి రాందాస్ గౌడ్,గ్రామ పెద్దలు భారీగా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News