- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
బి ఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ (IPS)ని హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన బండరావిరాల గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్, గ్రామ పంచాయతీ పాలక వర్గం. ఈ సందర్బంగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ సారి పాలక వర్గంలో అందరూ విద్యావంతులు, యువకులు, గెలవడంతో నూతన పాలక వర్గం గ్రామ అభివృద్దిని చరిత్రలో నిలిచి పోయేటట్లు చేయాలని, సలహలు, సూచనలు ఇచ్చారు.
అనంతరం పాలక వర్గం సబ్యులను శాలువాతో సన్మానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దూస శంకర్ ముదిరాజ్, వార్డు సభ్యులు కన్నె భరత్ యాదవ్, ఏర్పుల హరికృష్ణ, కందికంటి అనూష ప్రవీణ్, గుండ్ల భవాని, శివ ముదిరాజ్, యువజన నాయకులు గుండ్ల సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
