నమ్మదగిన సమాచారం మేరకు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 11.03 తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో మల్లికార్జున నగర్ కమాన్ సమీపంలోని ఓపెన్ గ్రౌండ్ వద్ద అంబేద్కర్ నగర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గంజాయితో సంచరిస్తున్నారనే సమాచారం అందింది.
ఈ సమాచారం మేరకు ఉమెన్ ఎస్సై మౌనిక ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని చెక్ చేయగా వారి వద్ద సుమారు 1 కిలో 50 గ్రాముల గంజాయి లభ్యమైంది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి పేర్లు కొల్లిపాక కౌశిక్ (వయసు 23), నివాసం మల్లికార్జున నగర్, దమ్మాయిగూడ, దేవేంద్ర (వయసు 22), నివాసం మల్లికార్జున నగర్ గా గుర్తించారు.
వారు గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ పూర్తిచేసి ఈ రోజు రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
