చార్మింగ్ స్టార్ శర్వా, బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నందితో కలిసి భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ సినిమా చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె రాధామోహన్ ఎపిక్ స్కేల్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం శర్వా కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వెంచర్‌లలో ఒకటిగా రూపొందుతోంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
శర్వాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ ఈరోజు ఒక ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో శర్వా పూర్తిగా మాసీ, ఇంటెన్స్ అవతార్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. రగ్గడ్ జుట్టు , గడ్డంతో శర్వా రా, రెబెలియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. పెదవుల మధ్య బీడి పెట్టుకుని, దాని నుంచి నెమ్మదిగా బయటకు వస్తున్న పొగ ఆయన పాత్రలోని అటిట్యూడ్‌ను మరింత హైలైట్ చేస్తోంది. చెమటతో తడిసిన ముఖం, రఫ్ టెక్స్చర్ పాత్రలోని గ్రిటీ రియలిజాన్ని చూపిస్తోంది. ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్ ఫియర్స్, రాజీ పడని వ్యక్తిత్వాన్ని ప్రజెంట్ చేస్తోంది.

“ఎ బ్లడ్ ఫెస్ట్” అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో శర్వానంద్ ఇప్పటివరకు కనిపించని రస్టిక్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన మేకోవర్ ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రాన్ని 1960ల కాలంలో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్లో హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు.
ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె, సినిమాటోగ్రఫీ కిషోర్ కుమార్ అరోకియా నిర్వహిస్తుండగా, బ్లాక్‌బస్టర్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఆగస్టు 28న రక్షా బంధన్ సందర్భంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి గ్రాండ్ పాన్-ఇండియా రిలీజ్ కానుంది.
తారాగణం: చార్మింగ్ స్టార్ శర్వా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కెకె రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
సమర్పకులు: లక్ష్మీ రాధామోహన్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డిఓపీ: కిషోర్ కుమార్ అరోకియా
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
పీఆర్వో: వంశీ-శేఖర్
