Sunday, March 1, 2026
Homeసాహిత్యంSpirituality | చక్షు న్మీలిత

Spirituality | చక్షు న్మీలిత

ఆలోచనలు నిండిన చిత్తం
నవనవోన్మేష ఆశల మోసులెత్తు!

అంతరంగమున వెలిగిన జ్ఞాన పుంజం
చక్షు న్మీలిత బుద్ది దివ్యజ్ఞాన రూపమెత్తు!

- Advertisement -

వచియించిన వజ్ర వాక్కుల గుణము
క్షుద్రముల ఖండించు గనమై ఖడ్గమెత్తు!

సహస్రార చక్ర చైతన్యం
సంచిత కర్మల రూపుమాపు!

పరమాత్ముని పరిపరి విధముల
భక్తిగాన స్త్రోత్రమ్ములెటు వెల్లువెత్తు
ఆ ప్రాంతమ్ములు చరితార్థమ్ములు!

నిత్య సత్య ధర్మాచరణ లు
నిజముగా నిలుపునట్టి హృది
పరమానంద భగవత్ సన్నిధి!

  • పట్లోళ్ళ బక్కారెడ్డి
- Advertisement -
RELATED ARTICLES

Latest News