Wednesday, February 18, 2026
HomeతెలంగాణProtest | ప్రజా భవన్ ని ముట్టడించిన జాగృతి కార్యకర్తలు..

Protest | ప్రజా భవన్ ని ముట్టడించిన జాగృతి కార్యకర్తలు..

  • కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిరసన..
  • మహిళలు, వృద్ధులు, వికాలాగులను ఆదుకోవాలి..
  • కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలి..
  • ప్రజావాణి నోడల్ ఆఫీసర్ కి వినతి పత్రం ఇచ్చిన కవిత..

మహిళలు, వృద్ధులు, వికలాంగులు సహా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ప్రజా భవన్ ముట్టడి కార్యక్రమం జరిగింది.. బేగంపేటలోని ప్రజాభవన్ ఎదుట బైఠాయించి కవిత ఆందోళన చేపట్టింది.. ఈ కార్యక్రమంలో మహిళలు, ఇతర నాయకులు పాల్గొన్నారు..

సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ చొరవ తీసుకుని మహిళలకు రూ.2,500, తులం బంగారం ఇవ్వడంతో పాటు పింఛన్ లు పెంచాలని నినాదాలు చేశారు.. ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యకి, కవిత వినతి పత్రం అందజేశారు.. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి. బీఆర్ఎస్ దయతోనే బీజేపీకి ఒకటో, రెండో మున్సిపల్ ఛైర్మన్ సీట్లు వచ్చాయి.

- Advertisement -

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు ఈ ఎన్నికల్లో సహకారమే తొలిమెట్టు. మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. ఈ నెల 26 న ప్రవేశ పెట్టే బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. లేదంటే సెక్రటేరియేట్, అసెంబ్లీ ముట్టడిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను చేపడతాం అని హెచ్చరించారు.. .

హామీలు పూర్తి చేయమని అడిగేందుకు ఇవ్వాళ ప్రజావాణికి వచ్చాం. ఇక్కడకు వస్తే సీఎం లేడు. రోజు ప్రజావాణిలో ఉంటానని చెప్పిన సీఎం ఒక్కసారి మాత్రమే ఉన్నాడు. మా విద్యార్థులు, మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి దురుసుగా ప్రవర్తించారు. వారిని దుర్భాలాడారు. ఇలాంటి పనులు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇవ్వాళ నేను ఇక్కడకు వచ్చే కార్యక్రమం లేదు. కానీ మా వారిని అరెస్ట్ చేస్తున్నారంటే వచ్చాను. మా అందరి దగ్గర ఆధార్ కార్డులు, అప్లికేషన్ ఫామ్ లు ఉన్నాయి.

శాంతియుతంగా మేము ప్రజాభవన్ లో ఉన్న అధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం. ఫిబ్రవరి నెల 26 నుంచి బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ లో మహిళలకు ఇచ్చిన హామీలు రూ. 2500, స్కూటీలు, తులం బంగారం కోసం నిధులు కేటాయించాలి. ఈ ప్రభుత్వానికి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయించాలి. 2 వేల పెన్షన్ నాలుగు వేలు చేయాలి.

అన్ని హామీలను కూడా నెరవేర్చాలి. ఈ నెల 26 వరకు వేచి చూస్తాం. ఆ తర్వాత అన్ని జిల్లాల్లో ఉద్యమాలు చేపడతాం. అవసరమైతే సెక్రటేరియేట్, అసెంబ్లీ కూడా ముట్టడిస్తాం. రైతులకు బోనస్ ఇచ్చి ఘనంగా చెప్పుకుంటున్నారు. మీరు ఇస్తామన్నదే ఇచ్చారు తప్ప ఘనకార్యం చేయలేదు.

రైతులకు ఇచ్చి మహిళలకు ఇవ్వలేదంటే వారి తరఫున మాట్లాడే వాళ్లు లేరనుకుంటున్నారా? ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలను ఎగగొట్టే ప్రయత్నం చేయకండి. మహిళలకు కోటిశ్వరులను చేస్తామన్నారు. కనీసం వారికిస్తామన్న రూ. 2500 అయిన ఇవ్వండి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి పోరాటాలు చేస్తుంది అన్నారు కవిత..

- Advertisement -
RELATED ARTICLES

Latest News