Tuesday, February 10, 2026
Homeమహబూబ్‌నగర్‌Congress Candidate | గెలిపించే బాధ్యత మీది.. అభివృద్ధి చేసే బాధ్యత నాది.

Congress Candidate | గెలిపించే బాధ్యత మీది.. అభివృద్ధి చేసే బాధ్యత నాది.

  • అవకాశం ఇచ్చి అభివృద్ధికి బాటలు వేయండి.
  • అంబేద్కర్ కళాభవన్ నిర్మించుటకు కృషి చేస్తా.
  • ధనలక్ష్మి, 21 వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి..

21 వ వార్డు కౌన్సిలర్ గా గెలిపించే బాధ్యత మీదని అభివృద్ధి చేసే బాధ్యత నాదని 21 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధనలక్ష్మి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం వార్డులలో గడప గడపకు తిరిగి ఓటర్లను కలుస్తూ మీ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మేఘా రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి, డిసిసి అధ్యక్షుడు కొత్త కాపు శివసేన రెడ్డి సహకారంతో వార్డును పట్టణంలో ఆదర్శవార్డుగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.

అవకాశం ఇచ్చి వార్డు అభివృద్ధికి బాటలు వేయాలని.. అంబేద్కర్ కళాభవన్ నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మీ ఇంటి ఆడ బిడ్డగా వస్తున్నానని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నదని, వార్డులో కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఉంటే వార్డు అభివృద్ధి, సమస్యలను వేగంగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గంధం కొండన్న, నాయకురాలు గంధం చిట్టెమ్మ, సేవాదళ్ నాయకులు గోర్ల జాన్, జయమ్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News