Friday, February 27, 2026
Homeహైదరాబాద్‌Chilkalguda | రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్

Chilkalguda | రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్

చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా,మంగళవారం చిలకలగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ వి జగన్ రెడ్డి ఆధ్వర్యంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ట్రాఫిక్ అదనపు డీసీపీ ఎ. రాములు,సికింద్రాబాద్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ ఎ.శ్రీనివాస్ ల ఆదేశాలతో ప్రత్యేక డ్రైవ్ జరిగింది.చిలకలగూడ మెట్రో పిల్లర్ నంబర్ 1140 వద్ద నిర్వహించిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో, బి.జగన్ రెడ్డి,చిలకలగూడ ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓతో పాటు ట్రాఫిక్ ఎస్ఐ శ్రీధర్,ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.డ్రైవ్ సందర్భంగా రాంగ్ సైడ్‌లో వాహనాలు నడుపుతున్న పలువురు వాహనదారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా అదనపు డీసీపీ ఎ.రాములు నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టం,ట్రాఫిక్ అంతరాయాలపై అవగాహన కల్పిస్తూ,ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని హెచ్చరించారు.ట్రాఫిక్ పోలీసుల ఈ చర్యలతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ,ఇటువంటి డ్రైవ్‌లు తరచుగా నిర్వహించాలని కోరుచుండడం విశేషం.రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత అని,నియమాలు పాటించినప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News