ఖేలో ఇండియా, శాయ్ మద్దతు కోరిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
మహిళల క్రీడల ప్రోత్సాహానికి అస్మిత పథకం–ఎస్‌ఏఐతో చర్చలు
సండే ఆన్ సైకిల్‌తో ఫిట్‌నెస్, యువత ఆరోగ్యం, క్రీడలే లక్ష్యంగా ప్రభుత్వ అడుగులు
ఖేలో ఇండియా–ఎస్‌ఏఐ మద్దతు కోసం ఖేలో ఇండియా డిప్యూటీ డైరెక్టర్ మయాంక్ శ్రీవాస్తవను కలిసిన మంత్రి
క్రీడల పట్ల ఉన్నత తపనతో ఏపీ మంత్రి(AP Sports Minister) మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(Mandipalli Ramprasad Reddy) రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి దిశగా కార్యాచరణ చేపడుతున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(Sports Authority of India-SAI), ఖేలో ఇండియా(Khelo India) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మయాంక్ శ్రీవాస్తవను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశాలపై విస్తృతంగా చర్చించారు. మహిళా క్రీడాకారుల ప్రోత్సాహం కోసం అస్మిత పథకం కింద ప్రతి జిల్లాలో మహిళల అథ్లెటిక్స్ నిర్వహణ, ఎస్‌ఏఐ నిధులతో జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడల పోటీలు, ప్రతి ఆదివారం సండే ఆన్ సైకిల్ ఫిట్‌నెస్ కార్యక్రమాలు, కోచ్‌ల సంఖ్య పెంపు, క్రీడల బడ్జెట్ పెంపు వంటి ప్రతిపాదనలను మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎస్‌ఏఐ నుంచి మరింత ప్రత్యేక దృష్టి, సహకారం అందించాలని మంత్రి కోరగా ఈ ప్రతిపాదనల పట్ల మయాంక్ శ్రీవాస్తవ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తగినంత సహాయ సహకారాలు అందిస్తామని, రాష్ట్రంలో పర్యటిస్తామని మంత్రికి తెలిపారు.
