Friday, March 27, 2026
HomeతెలంగాణJubilee Hills | ప్రజాధనానికి స్నానం..!

Jubilee Hills | ప్రజాధనానికి స్నానం..!

  • బాత్ రూమ్స్ పాలవుతున్న ప్రజాధనం
  • ఓ మినిస్టర్ బాత్ రూమ్ రిపేరు రూ.76 లక్షలు
  • నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • జూబ్లీహిల్స్, మినిస్టర్స్ క్వార్టర్స్ ఘటన

ఒకప్పుడు గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారం సంచలనం సృష్టించింది.. ఆయన బంగ్లాలో ఆయన కూర్చునే సింహాసనం బంగారంతో చేయించారని.. అలాగే జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా వున్నప్పుడు కట్టించిన రిషికొండ ప్యాలెస్ లో బాత్ రూంలో అత్యంత విలువైన బాత్ టబ్ తదితరాలు ఉన్నాయని వార్తల్లో చదివాము.. కానీ అంతకంటే విలువైన, విచిత్రమైన సంఘటన హైదరాబాద్, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12లో నెలవైవున్న మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఒక అమాత్యుడు నివాసం ఉండే చోట బాత్ రూమ్ రిపేర్ కోసం ఏకంగా రూ.76 లక్షలు విడుదల చేస్తూ ప్రభుత్వం జీ.ఓ. ( జీఓ ఆర్.టి.నెంబర్ : 60 తేదీ : 27-01-2026 ) జారీ చేసింది..

ఇప్పుడీ వ్యవహారం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.. ఆ బాత్ రూమ్ ఏమైనా బంగారంతో నిర్మించారా..? అక్కడి వస్తువులు బంగారంతో తయారు చేశారా..? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలు నానా అగచాట్లు పడుతుంటే వారిని ఆదుకునే ప్రయత్నం చేయకుండా.. కేవలం బాత్ రూమ్ రిపేర్లకు ఇంతింత ప్రజాధనం వృధా చేస్తారా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. రాజు తలచుకుంటే దెబ్బలకు కరువా..? అన్నట్టు ఈ వ్యవహారం ఉందని విశ్లేషకులు అంటున్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News