Tuesday, February 10, 2026
Homeమెదక్‌Urea | యూరియా అమ్మకాలు సాఫీగా జరగాలి.

Urea | యూరియా అమ్మకాలు సాఫీగా జరగాలి.

  • జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్
  • కొత్తపల్లి సహకార సంఘం సందర్శన

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా అమ్మకాలు సాఫీగా జరగాలని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సహకార కేంద్రం ముందు యూరియా కోసం రైతులు క్యూ లైన్ లో వేచి ఉన్న వీడియోలు సోషల్ మీడియాతో పాటు పలు వార్తా పత్రికల్లో కథనాలు వెలువడడంతో బుధవారం పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి రైతు సేవా సహకార సంఘాన్ని సందర్శించిన ఆయన యూరియా అమ్మకాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.

అమ్మకాలు,రైతుల యొక్క వివరాలను సొసైటీ సీఈవో వెంకటేశ్వర్లు ను అడిగి తెలుసుకున్నారు. యూరియా అమ్మకాల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.డి.ఏ విజయలక్ష్మి, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస రాజు, పర్సన్ ఇన్చార్జి మెదక్ డిసిఓ ఎల్ శంకర్, కిసాన్ కాంగ్రెస్ మెదక్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మల్లప్ప, వెంకటకృష్ణ, యాదగిరి, పోచరాజు, రైతులు మరియు సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News