కర్ణాటకలో అక్రమం(Illegal)గా ఉంటున్న బంగ్లాదేశీయులను(Bangladesh) గుర్తించి వాళ్ల దేశానికి పంపిస్తామని బీజాపూర్ సిటీ ఎమ్మెల్యే(Bijapur City Mla) బసనగౌడ ఆర్ పాటిల్ యత్నాల్(Basanagouda R Patil Yatnal) చెప్పారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి(Union Home Minister) అమిత్‌షా (Amitshah)కు లేఖ రాశారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిత ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ బంగ్లాదేశ్ వలసదారులకు కర్ణాటక “సురక్షిత స్వర్గధామం”గా మారిందని యత్నాల్ తన లేఖలో పేర్కొన్నారు. దొడ్డి దారిన కర్ణాటకకు వస్తున్న బంగ్లాదేశీయులు.. మురికివాడలు, ఏకాంత ప్రాంతాల్లో నివసిస్తూ ఇళ్లల్లో పని మనుషులుగా, రోజువారీ వేతన కార్మికులుగా, డ్రైవర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇటీవల వివిధ పౌర సంఘాలు, మీడియా సంస్థలు, హిందూ కార్యకర్తలు కర్ణాటక అంతటా అనేక ప్రదేశాల్లో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను విజయవంతంగా గుర్తించారని చెప్పారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పోలీసులకు వారి గురించి తెలిసినా ఆమ్యామ్యాలు పుచ్చుకొని మౌనంగా ఉండిపోతున్నారని ఆరోపించారు.
Karnataka | అక్రమ బంగ్లాదేశీయులను వెనక్కి పంపిస్తాం
- Advertisement -
RELATED ARTICLES
