Thursday, February 12, 2026
Homeస్పోర్ట్స్T20 | న్యూజిలాండ్‌పై ఇండియా విజయం

T20 | న్యూజిలాండ్‌పై ఇండియా విజయం

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌(Nagpur)లో న్యూజిలాండ్‌(Newzealand)తో బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌(First T20 match)లో ఇండియా 48 పరుగుల తేడాతో విజయం(India Win) సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 238 రన్నులు చేసింది. 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 రన్నులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇండియా 1-0 తేడాతో ఆధిక్యత(Domination in Series) సాధించింది. మన జట్టులో అభిషేక్ శర్మ 84 పరుగులు చేసి హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. రింకూ సింగ్ సైతం 44 రన్నులతో రాణించాడు. న్యూజిలాండ్ టీమ్‌లో గ్లెన్ ఫిలిప్స్ 78 రన్నులు చేసి టాప్ స్కోరర్‌ అయ్యాడు. టీమిండియా బౌలర్లలో వరుణ్, శివం చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అర్షదీప్, హార్దిక్, అక్సర్ తలో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News