- షాద్‌నగర్ కుమ్మరి సంఘం.
- ప్రతి అమావాస్యకు పేదల కడుపు నింపుతున్న కుమ్మరి సంఘం.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజున పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని “మొల్లమాంబ” విగ్రహం వద్ద, షాద్ నగర్ ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఈ అన్నదాన కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమాన్ని షాద్‌నగర్ కుమ్మరి సంఘం అధ్యక్షులు నడికుడ రుక్మిణి దేవి శ్రీశైలం, మల్లయ్య గారి జ్యోతిర్మయి జ్ఞానేశ్వర్, కే.కృష్ణయ్య, కే.రమేష్ (ఉప సర్పంచ్ పెంజర్ల), శ్రీనివాస్ తదితరులు సమిష్టిగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అమావాస్య రోజు పెద్దల ఆశీర్వాదంతో పేదలకు అన్నదానం చేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ప్రతి అమావాస్యకు ఇదే విధంగా అన్నదానం కొనసాగిస్తామని తెలిపారు. పేదలకు అన్నదానం చేయడం తమకు దక్కిన అదృష్టమని పేర్కొన్నారు.

