- కాంగ్రెస్‌లో ఇద్దరూ బిఆర్ఎస్ లో ఇద్దరు
నర్సంపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ రేసులో ఆ నలుగురు వ్యక్తులు ప్రధానంగా నిలబడుతున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ గతంలో 24 కౌన్సిలర్, వార్డులు ఉండగా 8 గ్రామాలను విలీనం చేయడంతో ఇప్పుడు ప్రస్తుతానికి 30 వార్డులుగా మారిపోయింది. సుమారు 40,000 మంది ఓటర్లు ఉన్న నర్సంపేట మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు ఆ రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీల ఆది నాయకులు కలలు పట్టుకుంటున్నారు. నేనంటే నేనని ఆశావాహులు కలలు కంటూ ఆది నాయకుల వద్దకు పరిగెత్తుతున్నారు.
ఈ క్రమంలో నర్సంపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ బీసీ మహిళకు కేటాయించడంతో చైర్పర్సన్ రేసులో కాంగ్రెస్ నుండి ఇద్దరు బిఆర్ఎస్ పార్టీ నుండి ఇద్దరు ప్రధానంగా పోటీలో నిలుస్తున్నట్లు తీవ్రంగా చర్చలు నడుస్తున్నాయి. దీనిలో భాగంగా అధికార పార్టీ గతంలో తాజా మాజీ కౌన్సిలర్ పెండం లక్ష్మీ రామానంద్ 25వ వార్డు నుండి పోటీ చేయడానికి సిద్ధపడి చైర్పర్సన్ దక్కించుకునేందుకు తీవ్రంగా కసరత్తు నిర్వహిస్తున్నారు.అదే విధంగా ఇదే పార్టీలో 21వ వార్డులో పోటీ చేసి గెలిచి బీసీ మహిళగా చైర్పర్సన్ ను దక్కించుకునేందుకు ఓబీసీ జిల్లా చైర్మన్ ఒర్సు తిరుపతి కోడలు ఒర్సు అంజలి తీవ్రంగా కసరత్తు చేస్తూ ఎలాగైనా సీటును కైవసం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక టిఆర్ఎస్ పార్టీ విషయానికొస్తే గతంలో చైర్మన్ గా విధులు నిర్వర్తించిన నాగలి వెంకట్ నారాయణ గౌడ్ సతీమణి పద్మ 29వ వార్డులో పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలుపొంది ఎలాగైనా చైర్ పర్సన్ సీటును కైవసంచేసుకోవాలని పావులు కదుపుతుంది. అదేవిధంగా తాజా మాజీ 10 వ వార్డు కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ ఇదే పదవ వార్డులో కౌన్సిలర్‌గా గెలుపొంది చైర్పర్సన్ సీటును కైవసం చేసుకోవాలని ఆది నాయకుల వద్ద విశ్వప్రయత్నం చేస్తుంది.
గతంలో తాజా మాజీ చైర్ పర్సన్ అవిశ్వాసం ద్వారా ఓడించి చైర్పర్సన్ సీటును కైవసం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశారు చివరకు ఇదే బిఆర్ఎస్ పార్టీలో కొంతమంది కౌన్సిలర్లు చేజారిపోవడంతో సీటు కాస్త చే దాటిపోయింది. రిజర్వేషన్ల ఖరారు అనంతరం చైర్ పర్సన్ రేసులో నలుగురు పోటీదారులు ఉన్నప్పటికీ ఇంకా చైర్ పర్సన్ కోసం పలువురు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం.

