Homeహైదరాబాద్‌Bhogi Celebrations | అడ్డగుట్టలో భోగి సంబరాలు

Bhogi Celebrations | అడ్డగుట్టలో భోగి సంబరాలు

  • చిన్నారులకు పతంగులు పంపిణీ
  • నక్క మధు ఆధ్వర్యంలో ఘనంగా పతంగుల పంపిణీ కార్యక్రమం

సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్‌లో సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి ఉత్సవాలు వైభవంగా నిర్వహించబడ్డాయి.బీఆర్ఎస్ సికింద్రాబాద్ నియోజకవర్గ సీనియర్ నాయకులు నక్క మధు ఆధ్వర్యంలో బుధవారం నాడు అడ్డగుట్టలో నిర్వహించిన పతంగుల పంపిణీ కార్యక్రమం స్థానికంగా విశేష స్పందనను పొందింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కుమారుడు,బీఆర్ఎస్ యువ నాయకుడు రామేశ్వర్ గౌడ్,అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి లు హాజరై చిన్నారులకు పతంగులు అందజేశారు.అడ్డగుట్ట డివిజన్ తుకారం గేట్ రైల్వే గేట్ బస్ స్టాప్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో పతంగులను స్థానిక చిన్నారులకు పంపిణీ చేయగా,పిల్లలు ఉత్సాహంతో సంబరాలు చేసుకున్నారు.

Grand Bhogi Celebrations with Kite Distribution in Addagutta

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో సంక్రాంతి పండుగకి ఒక విశిష్టమైన పండుగ అని అన్నారు.హరివిల్లులా మెరిసే ముగ్గులు,గొబ్బెమ్మలు,పతంగులు వంటి సంప్రదాయాలు మన సంస్కృతికి ప్రతీకలు అన్నారు.ఇటువంటి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు.భోగి పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అడ్డగుట్ట డివిజన్ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,మిత్రులు,శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.చిన్నారుల ముఖాల్లో కనిపించిన ఆనందమే ఈ కార్యక్రమానికి నిదర్శనంగా నిలిచిందని స్థానికులు ప్రశంసించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News