- కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
- నిషేధిత ప్రభుత్వ భూమిలో కబ్జాలు, అమ్మకాలు..
- అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్న రియల్ ఎస్టేట్ దందా
- ఈ భూమిని ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకురావాలి
మాకు అంగ బలం, అధికార బలం ఉంది ప్రస్తుతం మా పార్టీయే అధికారంలో ఉంది మేము చెప్పినట్లు మీరు వినాల్సిందే మా నాయకుడే మంత్రికి రైట్ హ్యాండ్ మా నాయకుడు ఏది చెప్తే మంత్రిగారు అది చేస్తారు.ఇక మమ్మల్ని ఎవరూ ఆపలేరు. మాకు నచ్చిన ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తాం, అమ్ముకుంటాం మాకు ఎవరు అడ్డువచ్చినా వారికే ముప్పు అంటూ యదేచ్ఛగా ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోంది. స్వయానా జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ ఆదేశాలు ఇచ్చినా కానీ వాటిని బేఖాతర్ చేస్తూ నిషేధిత భూమిని కబ్జాచేసిన అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు.
ఇదేమిటని అడిగితే అధికార పార్టీ నాయకులమని తమకు ఎవరూ అడ్డు చెప్ప కూడదని బెధిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వీరికి తోడు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా ఇందులో కీలకపాత్ర వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడ్డొచ్చిన వారిని సైతం బెధిరించడంతో ప్రభుత్వనిషేధిత భూమిలో రియల్ ఎస్టేట్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగు తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.

అడ్డూ అదుపు లేకుండా రియల్ ఎస్టేట్ దందా
చుంచుపల్లి మండలం చుంచుపల్లి రెవెన్యూ పరిధిలోని 137/1 సర్వే నెంబర్లో ఎకరం 34గుంటల భూమి నిషేదిత భూమిగా గుర్తించారు. అయితే కొంతమంది అక్రమార్కులు, రాజకీయ నాయకులు ఈభూమిలో ప్లాట్లు ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ దందాను కొనసాగిస్తూ క్రయ, విక్ర యాలు చేస్తూ కోట్లు ఆర్జీస్తున్నట్లు పంచాయతీ ప్రజలు ఆరోపిస్తున్నారు. తప్పుడు పత్రాలు సృష్టించి అది తమ భూమిగా చూపిస్తూ క్రయ విక్రయాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మా నాయకుడే మంత్రి రైట్ హ్యాండ్
రేయ్..మమ్మల్ని అడ్డుకునేది ఎవడ్రా, మేము అధికారంలో ఉన్నాం, మాకు నచ్చింది చేస్తాం మమ్మల్ని అడ్డుకుంటే ఊరుకు నేది లేదు. ఎవరైనా అధికారి వచ్చి మా దందాను అడ్డుకుంటే అతన్ని బదిలీలు చేయిస్తాం అంటూ కొంతమంది అధికార పార్టీ నాయకులు బెధిరింపులకు పాల్పడు తున్నట్లు తెలుస్తోంది. అదిప్రభుత్వ నిషేధిత భూమి అన్ని తెలిసినా కాని తప్పుడు ధృవపత్రాలు సృష్టిస్తూ అందర్నీ బురిడీ కొట్టిస్తున్నారు.
అంగబలం అధికారబలంతో వారికి అడ్డుచెప్పడానికి సైతం అధికారులు కూడా జంకు తున్నట్లు తెలుస్తోంది. స్వయానా తమ నాయకుడు మంత్రికి రైట్‌హాండ్ కావడం తమను ఎవరూ ఆపలేరంటూ బీరాలు పలుకుతుం డటంతో ప్రభుత్వ భూములకు రక్షణ కరువైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. దర్జాగా కబ్జాలు చేయడంతో పాటు అమ్మకాలు కొనసాగిస్తున్నా గాని ఎవరూ అడ్డుకోవడం లేదని పంచాయతీ ప్రజలు ఆరోపిస్తున్నారు.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా ఉండేందుకు, ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమిస్తే ఊరుకోమని సంబంధిత రెవెన్యూ అధికా రులు ప్రభుత్వ భూముల సంరక్షణకు చర్యలు చేపట్టాలని స్వయంగా జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ ఆదేశాలు జారీ చేశారు. సదరు ఆక్రమణ దారులకు ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ కలెక్టర్ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ నిషేధిత భూమిలో యదేచ్ఛగా ఆక్రమణలు జరుపుతున్నారు.
గత రెండు నెల క్రితం కలెక్టర్ ఆదేశాల మేరకు కొత్తగూడెం రెవెన్యూ డివి జనల్ అధికారి మధు నిషేధిత భూమిని సందర్శించి ఇది నిషేధిత భూమి అని ఈ భూమిలో ఎవరూ ఎటువంటి నిర్మా ణాలు, ఆ నిర్మాణాలకు ఇంటినెంబర్లు ఇవ్వవద్దని ఈభూమిలో బోర్డు ఏర్పాటు చేయాలని రామాంజనేయకాలనీ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్‌కు ఆదేశాలు జారీ చేశారు.అయినా కాని ఈనిషేధిత ప్రభుత్వ భూమిలో యదేచ్ఛగా జెసిబిల సహయంతో ఇంటి నిర్మాణాల కోసం పునాదులు, బోర్లు, వేసి నిర్మాణాలు చేపడుతున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈభూమిని ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకురావాలి
ఈనిషేధిత ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా చూసి సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోని ఆభూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోని రామాంజనేయకాలనీ, వెంకటేశ్వరకాలనీ, విద్యానగర్ కాలనీ పంచాయతీ ప్రజల సౌకర్యార్థం ఈస్థలంలో క్రీడామైదానం, వాకింగ్‌ట్రాక్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్‌ను ఆయా పంచాయతీ ప్రజలు కోరుతున్నారు.
