ప్రస్తుతం ఇండియా(India), బంగ్లాదేశ్(Bangladesh) మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా(Professional Golf Tour of India)లో ఆ దేశ ఆటగాళ్లను అనుమతిస్తారా లేదా అనేది ఇంకా తేలలేదు. దీనిపై పీజీటీఐ ప్రెసిడెంట్(PGTI President) కపిల్‌దేవ్(Kapil Dev) స్పందిస్తూ.. ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. కూర్చొని మాట్లాడుకున్నాక తాజా పరిస్థితిపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. క్రికెట్(Cricket)కి సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(Bangladesh Cricket Board) లేటెస్ట్గా తీసుకున్న నిర్ణయంపై స్పందించేందుకు కపిల్‌దేవ్ నిరాకరించారు. గోల్ఫ్ క్రీడ వృద్ధిని వేగవంతం చేయడానికి మన దేశం.. జట్టు ఆధారిత ప్రణాళికలను రచించాలని సూచించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాదిరి ఏర్పాట్లు చేయాలని అభిప్రాయపడ్డారు. ‘వ్యక్తిగత ప్రతిభకు ఎప్పుడూ తిరుగుండదు. కానీ.. జట్టుగా ఆడటం అనేది భిన్నం అని చెప్పొచ్చు. గోల్ఫ్ క్రీడాకారులు జట్టు క్రీడలోని మజాను రుచి చూడాలనేది మా ఉద్దేశం’ అని కపిల్‌దేవ్ అన్నారు.
PGTI | బంగ్లాదేశ్ ఆటగాళ్లను అనుమతిస్తారా?
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
