Wednesday, February 11, 2026
HomeతెలంగాణNumaish | నుమాయిష్‌-2026 వివరాలివే..

Numaish | నుమాయిష్‌-2026 వివరాలివే..

నుమాయిష్‌-2026.. జనవరి 1న ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 15 వరకు జరుగుతుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తారు. హైదరాబాద్‌లోని నాంపల్లి(Nampally) ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌(Exhibition Grounds)లో ఏర్పాటుచేయనున్న ఈ 85వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన(All India Industrial Exhibition) వివరాలను మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఇందులో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్టాల్స్‌ను ఏర్పాటుచేసుకోవచ్చు. రోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు స్టాల్స్ ఓపెన్ చేసి ఉంటాయి. వీకెండ్స్.. అంటే.. శని, ఆదివారాల్లో రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ఎంట్రీ ఫీజు (Entry Fee) 50 రూపాయలు. కానీ.. ఐదేళ్లలోపు పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తారు. ప్రస్తుతానికి నుమాయిష్‌లో వెయ్యీ 50 స్టాల్స్‌కి పర్మిషన్ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News