గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు(Ghmc Elections) 2026 ఫిబ్రవరిలో జరగొచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్కే పురం డివిజన్(RK Puram Division) నుంచి బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అభ్యర్థిగా గౌతం చికిలం(Gautham Chikilam) రేసులో నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. యువకుడు, ఉత్సావంతుడు, పోరాటాలకు ముందుండే నాయకుడనే పేరు సంపాదించుకోవటం ఇతనికి కలిసొచ్చే అంశాలు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం, పార్టీ కోసం విద్యార్థి విభాగం నుంచి గౌతం ఎంతో కష్టపడ్డారు.
అందుకే ఈసారి బల్దియా ఎలక్షన్లలో ఈ చురుకైన నేతకు కార్పొరేటర్‌గా పోటీ చేసే ఛాన్స్ ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ గనక తనకు అవకాశం ఇస్తే ఆర్కే పురంలో గులాబీ జెండాను ఎగరేస్తానని గౌతం చకిలం మీడియాతో చెప్పారు. రాష్ట్రంలోని అధికార పార్టీ కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతానని తెలిపారు. ఆర్కే పురంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించటం ద్వారా జీహెచ్ఎంసీలో మళ్లీ మన సత్తా చాటడంలో తన వంతు కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. మరోసారి ఉద్యమ స్ఫూర్తితో పనిచేసి అన్ని వర్గాలను కలుపుకుపోతానని గౌతం చకిలం పేర్కొన్నారు.
