Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌Sridarbabu | పర్ఫెక్షన్, సిన్సియారిటీ రెండూ ఉండాలి

Sridarbabu | పర్ఫెక్షన్, సిన్సియారిటీ రెండూ ఉండాలి

యువ సివిల్ సర్వెంట్లకు మంత్రి శ్రీధర్ బాబు దిశానిర్దేశం
ప్రజాసేవలో బాహ్య ఒత్తిళ్ల కన్నా అంతర్గత బలహీనతలే ప్రమాదమని హెచ్చరిక
పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే ‘గుడ్ గవర్నెన్స్’ అని సూచన

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి (Minister of IT and Industries) శ్రీధర్ బాబు యువ సివిల్ సర్వెంట్ల(Young civil servants)కు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ (Mcrhrd) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ(Institute Of Telangana)లో గురువారం నిర్వహించిన ‘స్పెషల్ ఫౌండేషన్ కోర్స్ ఫర్ ఏఐఎస్ & సీసీఎస్ ఆఫీసర్స్–2025’(Special Foundation Course for AIS & CCS Officers) ముగింపు వేడుకలకు ఆయన విశిష్ఠ అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ దేశం మీ నుంచి కేవలం పర్ఫెక్షన్ (Perfection) మాత్రమే ఆశించడం లేదని, అంతకన్నా ఎక్కువగా మీ పనిలో సిన్సియారిటీ(Sincerity)ని కూడా కోరుకుంటోందని చెప్పారు. గవర్నెన్స్ అంటే కేవలం ఫైళ్లు, నిబంధనలు కాదని, ప్రజలతో మమేకమయ్యే హ్యూమన్ రిలేషన్ అని తెలిపారు.

- Advertisement -

అధికారం, హోదా, ప్రొటోకాల్స్ అన్నీ తాత్కాలికమని, ప్రజల జీవితాల్లో మీరు తీసుకొచ్చే సానుకూల మార్పు మాత్రమే శాశ్వతమని ఉద్భోదించారు. నిర్ణయాలు తీసుకునే సమయంలో సమాజంలోని చిట్టచివరి వ్యక్తిని, నిరుపేదల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అప్పుడే.. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అందుతాయని పేర్కొన్నారు. కార్యాలయాలకు మాత్రమే పరిమితం కాకుండా నిత్యం ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ప్రజాసేవలో బాహ్య ఒత్తిళ్ల కన్నా అహంకారం, ఉదాసీనత, అవినీతి లాంటి అంతర్గత బలహీనతలే ప్రమాదకరమని హెచ్చరించారు.

‘క్లిష్ట పరిస్థితుల్లో కూడా స్వీయ నియంత్రణ పాటిస్తూనే నిజాయితీ, వినమ్రత, ధైర్యం కోల్పోవద్దు. ప్రస్తుత పరిస్థితుల్లో పౌర సేవలు ప్రజల ముంగిటకు చేరాలంటే టెక్నాలజీ వినియోగం అత్యవసరం. అయితే.. ఆ సాంకేతికత ప్రజలకు చేరువగా ఉండాలి గానీ వారిని భయపెట్టేలా ఉండొద్దు. పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే గుడ్ గవర్నెన్స్ సాధ్యమవుతుంది. ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేయాలి’ అని శ్రీధర్ బాబు యువ అధికారులకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News