ప్రతి వ్యక్తి తన క్యాల్షియం స్కోర్‌ను బట్టి గుండెపోటు(Heart Attack) నుంచి తప్పించుకోవచ్చు. గుండెకు రక్తాన్ని సరఫరా(Blood Supply) చేసే నాళాల్లో కొలెస్ట్రాల్(Cholesterol)తోపాటు క్యాల్షియం ఏర్పటం వల్ల ప్రమాదం తలెత్తుతుంది. అందువల్ల ఆ స్కోర్‌ను తెలుసుకొని దాన్నిబట్టి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టొచ్చు. కార్డియాక్ సీటీ స్కాన్(Cardiac CT Scan)తో క్యాల్షియం స్కోర్‌ను తెలుసుకోవచ్చు. దీన్ని అగట్‌స్టన్ యూనిట్ల(Agatston Units)లో తెలియజేస్తారు. ఇది సున్నా నుంచి వెయ్యికి పైగా ఉండొచ్చు. ఈ స్కోర్ 300 కన్నా ఎక్కువగా ఉంటే గుండెపోటు వచ్చే అవకాశం 13 శాతం నుంచి 26 శాతం వరకు ఉంటుంది. వీరికి మూడు నుంచి ఐదేళ్లలో గుండెపోటు రావొచ్చు. క్యాల్షియం స్కోర్ 400, అంతకన్నా ఎక్కువ ఉంటే డేంజర్ జోన్(Danger Zone)లో ఉన్నట్లు లెక్క. గర్భంతో ఉన్నవాళ్లు ఈ స్కానింగ్ చేయించుకోకూడదు.
Calcium Score | మీ క్యాల్షియం స్కోర్ ఎంత?
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
