కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆ పార్టీ అగ్ర నేత, పార్లమెంటరీ పార్టీ లీడర్ సోనియా గాంధీ (Sonia Gandhi) జన్మదిన వేడుకలు (Birth Day Celebrations) ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు(Tpcc President), ఎమ్మెల్సీ (Mla) మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కేక్ కట్ (Cake Cutting) చేసి చిన్నారులకు పంచారు. విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత వి.హనుమంతరావు(వీహెచ్), మహిళా నేత సునీతారావు తదితరులు పాల్గొన్నారు.


- Advertisement -
