Monday, April 13, 2026
Homeబిజినెస్Allu Cinemas | హైదరాబాద్‌ థియేటర్లకు గట్టి పోటీ!

Allu Cinemas | హైదరాబాద్‌ థియేటర్లకు గట్టి పోటీ!

హైదరాబాద్ శివారు కోకాపేట(Kokapet)లో త్వరలో అందుబాటులోకి రానున్న ‘అల్లు సినిమాస్’.. నగరంలోని సినిమా థియేటర్లకు గట్టి పోటీ ఇవ్వబోతోందని అంటున్నారు. దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్‌‌(Largest Dolby Cinema Screen)ను ఇక్కడ ఏర్పాటుచేశారు. తద్వారా ఈ విశ్వనగరంలో సినిమా చూసే అనుభవాన్ని పునర్నిర్వచించేందుకు సిద్ధమవుతోంది. 75 అడుగుల వెడల్పు గల ఈ భారీ స్క్రీన్ DCI ఫ్లాట్ 1.85:1 ఫార్మాట్‌లో పనిచేస్తుంది.

డాల్బీ విజన్, డాల్బీ 3D ప్రొజెక్షన్ టెక్నాలజీతో అద్భుతమైన విజువల్స్‌ను చూపిస్తుంది. విజువల్స్‌కు అనుబంధంగా అత్యాధునిక డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ (Atmos Sound System) ఉంది. ప్రేక్షకులను గొప్ప, బహుమితీయ ఆడియోలో ముంచెత్తేలా దీన్ని రూపొందించారు. లగ్జరీకి తోడు ఉన్నతమైన సౌకర్యం, అంతరాయంలేని వీక్షణ అనుభవాన్ని ఇందులో సొంతం చేసుకోవచ్చు. ఈ థియేటర్‌లో పిచ్-బ్లాక్ స్టేడియం సీటింగ్‌ను ఏర్పాటుచేయటం విశేషం. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జేమ్స్ కామెరూన్ చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar: Fire and Ash) విడుదల సందర్భంగా ఈ థియేటర్ గ్రాండ్ ఓపెనింగ్ జరగనుందని భావిస్తున్నారు.

- Advertisement -

ఇది సినిమా అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని ఆశిస్తున్నారు. 2026లో సంక్రాంతి(Sankranthi)కి ప్రారంభోత్సవాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అల్లు సినీప్లెక్స్ మన దేశంలోని ఆరు డాల్బీ సినిమా ఇన్‌స్టాలేషన్లలో ఒకటిగా నిలుస్తుంది. ప్రీమియం సినిమా ఫార్మాట్‌లకు ప్రధాన గమ్యస్థానంగా హైదరాబాద్‌ను బలోపేతం చేస్తుంది. నగరంలో హైఎండ్ సినిమా అనుభవాలకు పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News