Thursday, February 12, 2026
Homeస్పోర్ట్స్Harbhajan Singh | సెలక్టర్లపై హర్భజన్‌సింగ్ ఫైర్

Harbhajan Singh | సెలక్టర్లపై హర్భజన్‌సింగ్ ఫైర్

టీమిండియా(Team India) ప్లేయర్ల(Players)ను ఎంపిక చేసే విషయంలో సెలక్టర్ల(Selectors)పై మాజీ క్రికెటర్ (Former Cricketer) హర్భజన్ సింగ్ ఫైర్ అయ్యాడు. ఆటలో పెద్దగా ఏమీ సాధించనివారు సెలక్షన్ కమిటీలో ఉంటున్నారని తప్పుపట్టాడు. కెరీర్‌లో చెప్పుకోదగ్గవి లేని అలాంటివాళ్లు.. రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) లాంటి వాళ్ల భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించాడు.

ఇలాంటి పరిస్థితి ఉండటం బ్యాడ్‌లక్ అని అభిప్రాయపడ్డాడు. వీళ్లిద్దరు 2027 వన్డే వరల్డ్ కప్ (One Day World Cup) వరకు జట్టులో ఉంటారా అనే అంశంపై హర్భజన్ సింగ్ పైవిధంగా స్పందించాడు. ఐఎల్‌టీ సీజన్4 సందర్భంగా జరిగిన చర్చలో ఆయన పాల్గొని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సెలక్షన్ కమిటీ తప్పిదాలు గతంలో తన విషయంలోను, తన సహచరుల విషయంలోను జరిగాయని గుర్తుచేసుకున్నాడు.

- Advertisement -

రోహిత్, విరాట్ ఎంతో సాధించారని పేర్కొన్నాడు. రోజురోజుకూ ఆటలో ఇంప్రూవ్ అవుతూ టీమ్ మెంబర్స్‌కి ఇన్‌స్పిరేషన్‌గా మారారని ప్రశంసించాడు. టెస్ట్ మ్యాచ్‌లకు తయారుచేసే పిచ్‌ల విషయంలో జరుగుతున్న తప్పులను కూడా హర్భజన్ సింగ్ పట్టి చూపాడు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News