- డిసెంబర్ 10 నుంచి పరీక్షల నిర్వహణ.. 2,41,509మంది అభ్యర్థులు 2,71,692 దరఖాస్తులు
ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి. డిసెంబర్ 10 నుంచి జరగనున్న ఈ పరీక్షల హాల్ టికెట్లను అధికారులు వెబ్సైట్లో డౌన్లోడ్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి రోజూ రెండు విడతల్లో ఈ పరీక్షలు జరగనుండగా.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి సెషన్; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 23వరకు దరఖాస్తులు స్వీకరించగా.. 2,41,509మంది అభ్యర్థులు 2,71,692 దరఖాస్తులు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు, మాక్ టెస్టులను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు.
- Advertisement -
