అమరావతిలోని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ (Sri Venkateswara Swamy Temple) పనులకు సీఎం చంద్రబాబు (CM Chandra Babu) శంకుస్థాపన (Foundation stone laying) చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక పవిత్ర దేవాలయమైన వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు సంకల్పించామని చెప్పారు. దేవతల రాజధాని (capital of the gods) అమరావతి.. మన రాజధాని అమరావతి అని తెలిపారు. ఆ పేరు పెట్టడానికి కూడా దేవుడు తనకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో కలియుగ దైవం (God of Kali Yuga) అవతరించారని అన్నారు.
సీఎం చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
- 2019లో ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించాం.
- ఈ ప్రాంత రైతులకు దేవుడి సన్నిధి నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాను.
- పవిత్రమైన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలి.
- ఇక్కడి రైతులు సహకరించి 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ విధానంలో ఇచ్చారు.
- 25 ఎకరాల్లో పవిత్రమైన ప్రదేశం, కృష్ణా నది ఒడ్డున వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించుకుంటున్నాం.
- ఈ అమరావతి విషయంలో ఎవరికీ అనుమానం అవసరం లేదు.
- దేవతల రాజధానిగా అమరావతి ఏవిధంగా ఉంటుందో.. ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వేంకటేశ్వరస్వామిని కోరుకుంటున్నా.
- ఎన్టీఆర్ అన్నదానం 1983లో ప్రారంభించారు.
- నేను 2003లో ప్రాణదాణం తిరుపతిలో ప్రారంభించాను.
- బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవుడికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్తుంటే 23 క్లేమోర్ మైన్స్ పెట్టి బ్లాస్ట్ చేస్తే ఆ వెంకటేశ్వరుడు నాకు ప్రాణభిక్ష పెట్టారు.
- నేను, మా కుటుంబం ఇంటి దైవంగా వెంకటేశ్వరస్వామికి కొలుస్తాం.
- మా ఇంటి నుంచి చూస్తే స్వామి కొలువున్న శేషాచలం పర్వతం కనబడతుంది.
- ఆయన్ని చూస్తూ బతికి, స్వామి పాదపద్మాల చెంత తరించాం.
- వేంకటేశ్వర స్వామికి అప్రతిష్ట తెచ్చే పనులు చేయను. ఎవరినీ చేయనివ్వను.
- ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు పవిత్ర, పరిశుభద్రత, స్వచ్ఛమైన ఆలోచన ఉండాలి. అప్పుడే నిజమైన భక్తితో పని చేసినట్లు అవుతుంది.
- నేను ఎప్పుడు తిరుపతి వెళ్లినా క్యూలైన్లోనే భక్తితో వెళ్తాను.
- దేవుడి దగ్గరకు పెత్తందారుగా వెళ్లకూడదు. తప్పు చేసిన వారిని ఈ జన్మలోనే స్వామి శిక్షిస్తారు.
- ఆయన పవిత్రతను ఆయనే కాపాడుకుంటున్నారు.
- గత ప్రభుత్వం విధ్వంసం తప్ప మంచి చేసిన సందర్భాలు లేవు. మంచి సంకల్పంతో రైతులు భూములు ఇస్తే నరకాన్ని చూపించారు.
- మీరు వేంకటేశ్వరస్వామిని నమ్ముకున్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు యాత్ర చేసి రాజధానిని కాపాడుకోవడానికి పాటుపడ్డారు.
- ఈ పవిత్రమైన దేవాలయాలయాన్ని రూ.260 కోట్లతో పూర్తి చేస్తాం.
- అమరావతినే కాకుండా ఈ ప్రాంతాన్ని కాపాడే శక్తి ఈ దేవాలయానికి ఉంది.
- రెండున్నరేళ్లలో ఈ పనులు పూర్తి చేయాలని టీటీడీని కోరుతున్నాను.
- ఎన్టీఆర్ అన్నదానం, నేను ప్రాణదానం, మూడోది శ్రీవారి సేవకులు, నాలుగోది దేవాలయ నిర్మాణం.
- ఆలయాల నిర్మాణాలకు భక్తులు ముందుకు రావాలి.
- ఆరోగ్యం, సంపద, ఆనందం ప్రతి ఒక్కరికీ ఇవ్వాలని వేంకటేశ్వరస్వామిని కోరుకుంటున్నాను.
- Advertisement -
