iDEA ఏర్పాటుకు COLతో ఎంఓయూ
ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ (iDEA) ఏర్పాటుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU).. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్(COL)తో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. దీంతో.. BRAOU ప్రముఖ డిజిటల్ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందనుంది. బోధన, అభ్యాసం, పరిశోధనలను మెరుగుపరచడానికి iDEA అత్యాధునిక డిజిటల్ హబ్‌గా పనిచేస్తుంది.
టెక్నాలజీ ద్వారా BRAOU నాణ్యమైన విద్యను అందించనుంది. తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచడంతోపాటు వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలను బలోపేతం చేయడంతోపాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని COL అధ్యక్షుడు పీటర్ స్కాట్‌కు వివరించారు.
ఈ సమావేశంలో COL అధ్యక్షుడు & CEO పీటర్ స్కాట్(Mr.Petor Scott), ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, BRAOU వైస్ చాన్స్‌లర్ ఘంటా చక్రపాణి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
