ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక కఠినతరం
సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
రోడ్డు ప్రమాదాలను (Road Accidents) తగ్గించడానికి నిబంధనలు ఉల్లంఘిస్తున్న (Rules Break) వాహనాలపై కఠిన చర్యలు (Strict Action) తీసుకొనేందుకు రవాణా శాఖలో నిరంతరం నిఘా (Enforcement) ఉండేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. నిఘాను కఠినతరం చేయడానికి సచివాలయంలో రవాణా శాఖ ముఖ్య అధికారులతో మంత్రి (Minister Ponnam Prabhakar) పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నిఘా కోసం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో 33 బృందాలు, రాష్ట్ర స్థాయిలో మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. రోజూ విధిగా ఏయే ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలో ఆ బృందాలకు ఉదయం 6 గంటలకు రవాణా శాఖ ఉన్నతాధికారుల నుంచి సమాచారం (Information) వస్తుంది.
ముఖ్యంగా ఓవర్ లోడింగ్ (Over Loading) లారీలు, బస్సులు(Busses), మినరల్ ట్రాన్స్‌పోర్ట్‌లో శాండ్(Sand), ఫ్లైయాష్, స్టోన్, బిల్డింగ్ మెటీరియల్స్, వాహనాల ఫిట్నెస్, పొల్యూషన్, చలానాలపై నిఘా బృందాలు తనిఖీలు చేయనున్నాయి. వాటికి అదనపు పెనాల్టీతోపాటు వాహనాల సీజ్ చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఒక్కో బృందంలో డిటిసి ఎంవీఐ, ఏఎంవీఐ, ఇతర సిబ్బంది ఉంటారు. గత నెలలో రద్దు చెక్ పోస్ట్‌లలో పని చేసిన సిబ్బందిని కూడా నిఘాలో నియమించేలా ఆదేశాలు జారీ చేశారు. నిఘా బృందాలు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలు, వ్యవసాయ సంబంధిత ట్రాక్టర్లపై వేధింపులకు గురిచేయరాదని ఆదేశాలు జారీ చేశారు.
