Homeఆంధ్రప్రదేశ్Award | ఏపీ సర్కార్ నజరానా..

Award | ఏపీ సర్కార్ నజరానా..

  • విమెన్ క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల పురస్కారం
  • గ్రూప్ 1 ఉద్యోగంతోపాటు.. కడపలో ఇంటి స్థలం
  • సిఎం చంద్రబాబుతో భేటీ అయిన శ్రీచరణి, మిథాలీ
  • క్రికెటర్లను అభినందించిన సీఎం చంద్రబాబు, లోకేశ్
  • గన్నవరం విమానాశ్రయంలో మంత్రుల ఘనస్వాగతం

వన్డే ప్రపంచకప్లో సత్తా చాటిన తెలుగు తేజం, మహిళా క్రికెటర్ శ్రీచరణిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. శ్రీచరణికి రూ.2.5 కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటిం చింది. ఆమెకు గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు.. కడపలో ఇంటి స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది. ఇండియన్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ శుక్రవారం ఉద యం సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.

shree charani women cricketer award chandrababu mithali lokesh kadapa 2

ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడును వారు కలిశారు. క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఇరువురికి మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని సీఎం, మంత్రి అభినందించారు. ఆపై శ్రీచరణి, మిథాలితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనందక్షణాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో శ్రీచరణి పంచుకున్నారు.

- Advertisement -

ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళలు సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఉదయం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ టీమ్ విన్నర్ శ్రీచరణికి ఘన స్వాగతం లభించింది. శ్రీచరణికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

shree charani women cricketer award chandrababu mithali lokesh kadapa 1

అనంతరం ఎంపీలు, మంత్రులు, శాప్ ఛైర్మన్ కలిసి శ్రీచరణి, మిథాలి రాజ్ను వెంటపెట్టుకుని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అయితే గన్నవరం నుంచి బెంజ్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని ఏసీఏ మొదట భావించింది. ముఖ్యమంత్రితో భేటీ నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీని రద్దు చేశారు. చంద్రబాబును కలిసిన తర్వాత మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంను సందర్శించేందుకు శ్రీచరణి బయలుదేరి వెళ్లారు. అలాగే.. నేడు సొంత జిల్లా కడపకు శ్రీచరణి వెళ్లనున్నారు.

ఈ సందర్భంగా ఆంధక్రికెట్ అసోషియేషన్ సౌజన్యంతో జిల్లా క్రికెట్ అసోసియేషన్.. శ్రీచరణిని ఘనంగా సత్కరించనుంది. క్రికెటర్ శ్రీచరణి శుక్రవారం ఉదయం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అందరి అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కుటుంబం నుంచి నాకు చక్కటి ప్రోత్సాహం ఉంది. మా మామ నన్ను క్రికెట్ ఆడించేవారు. నేను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లో శిక్షణ పొందాను. ఇది మొదటి అడుగు మాత్రమే.. ముందు చాలా ఉంది. ప్రధాని మోదీని కలిసినప్పుడు భవిష్యత్ కార్యాచరణపై సలహాలిచ్చారఅని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News