Sunday, March 29, 2026
HomeతెలంగాణKishan Reddy | ఓటర్ డిసైడ్ కాలే..

Kishan Reddy | ఓటర్ డిసైడ్ కాలే..

  • ముస్లింలు కాంగ్రెస్కు ఇజ్జత్ అయితే.. మరి హిందువులు
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలను మోసం చేశాయి..
  • జూబ్లీహిల్స్ అభివృద్ధిని విస్మరించిన ప్రభుత్వం
  • ఇందులో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాత్రా ఉంది
  • ప్రచారంలో గత హామీలపై స్పష్టత ఇవ్వని కాంగ్రెస్
  • సన్నబియ్యంలో మెజార్టీ వాటా కేంద్రానిదే
  • మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
  • 6 గ్యారంటీలు, 400 పైచిలుకు హామీల అమలు చెస్ ఎక్కడా అని ప్రశ్నించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

గ్రామస్థాయిలో ఉండే అభివృద్ధి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఉప ఎన్నిక అంశంలో ఇంకా సర్వేలలో స్పష్టత లేదని చెప్పారు. సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కిషన్రెడ్డి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో భారత రాష్ట్రసమితికి మూడో స్థానం వచ్చిందన్న ఆయన.. ఓటర్లలో ఏ పార్టీకి ఓటు వేయాలో ఇంకా స్పష్టత లేదని చెప్పారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం లో 6 గ్యారంటీలను గానీ, 400 పైచిలుకు హామీల గురించి గానీ ఎక్కడా ప్రస్తావించడం లేదని, వ్యక్తిగత విమర్శలు చేయడంపైనే దృష్టి పెడుతోందని దుయ్యబట్టారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. గ్రామస్థాయిలో ఉండే అభివృద్ధి కూడా జూబ్లీహిల్స్లో లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఏ పార్టీకి ఓటు వేయాలనే దానిపై ఓటర్లు ఇంకా నిర్ణయానికి రాలేదని.. అందుకే సర్వేల్లో కూడా స్పష్టత లేదని కిషన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ వెనుకబాటుకు గతంలో పాలించిన బిఆర్ఎస్ కూడా బాధ్యత వహించాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని, గ్యారెంటీలపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యంలో మెజార్టీ వాటా కేంద్రానిదేనని కిషన్రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. దీనికి సంబంధించి ఒక పోస్ట్ ను కూడా కిషన్ రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు. ‘ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ‘ఇజ్జత్’ అంటావు, మరి హిందువులు ఇజ్జత్ కాదా మిస్టర్ రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులకు గౌరవం లేదా? ఎర్రగడ్డలో ఖబరస్థాన్ కోసం స్థలం ఇచ్చేందుకు మనసొచ్చింది కానీ, బంజారాహిల్స్లో పెద్దమ్మ తల్లి గుడికి 50 గజాలు స్థలం ఇవ్వడం ఎందుకు కుదరలేదు.

హిందువులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవు. ఎన్నాళ్లు మజ్లిస్ ను భుజాన ఎక్కించుకొని తిరుగుతావో తిరుగు. ప్రజలే నీకు గట్టి బుద్ధి చెబుతారని అంటూ కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఓటు వేయక పోతే సన్న బియ్యం, ఫ్రీ బస్ ఆగిపోతుంది అని సీఎం అన్నారు.. సన్నబియ్యం లో కేంద్ర ప్రభుత్వానిదే సింహభాగం.. ఏ విధంగా సీఎం ఆపుతారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు. సకల సమస్యలకు పరిష్కారం ఫ్రీ బస్సు అనే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన నిధులను, వచ్చిన సంస్థల వివరాలు కిషన్రెడ్డి వివరించారు.

వచ్చే ఏడాది మొదటి తైమాసికంలో బీబీనగర్ ఎయిమ్స్ భవనాలు ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభమవుతాయని వెల్లడించారు. 2 వందల బస్తీ దవాఖానలు కేంద్రం సహకారంతో నడుస్తున్నాయి. కేసీఆర్ పేరు మార్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 101 అభివృద్ధి కార్యక్రమాలు హైద్రాబాద్ పరిధిలో జరుగుతున్నాయన్నారు. రేవంత్ రెడ్డి స్థాయికు దిగజారి నేను అడ్డుకుంటున్నాను అని మాట్లాడుతున్నారు. మెట్రో గురుంచి కూడా మాట్లాడుతున్నారు..

ఎల్ అండ్ టి మేము చేయలేము అంటుంది? ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలి? కొత్త డిపిఆర్ కేంద్రానికి ఇవ్వాల్సి ఉందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణ బిడ్డగా నా నియోజక వర్గం అభివృద్ధి కోరుకుంటా.. బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి.. తెలంగాణ కోసం మా కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించాను.. వివిధ అంశాలపై కేసీఆర్కు 40 లెటర్లు రాశాను.. స్పందించలేదు.. అలాంటి వాళ్లు కూడా విమర్శలు చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు.. హైద్రాబాద్ లో డిఫెన్స్ మీద లక్ష 40 వేల కోట్లు ఖర్చు పెట్టింది కేంద్రం.. అని వెల్లడించారు.

పత్తి రైతులు ఆందోళన చెందొద్దు? మార్చి వరకు పత్తి కొంటాం.. కాంగ్రెస్ పార్టీ వి కూడా చాలా సార్లు డిపాజిట్ రాలేదు.. జూబ్లీహిల్స్ నాకు తెలుసు? అక్కడి ప్రజలు ఓటు వేసేది.. కౌంటింగ్ రోజు తెలుస్తుంది ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి.. రేవంత్ రెడ్డి మాటలను సిరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు.. ఆయన మాట్లాడుతూ పోతుంటారు మనం వింటూ పోవాలి.. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్ట్ మీద సిబిఐ దర్యాప్తు జరపాలి అని మేము అడుగుతున్నాం.. హై కోర్టులో కేసు నడుస్తుంది.. నేను కూడా ఢిల్లీతో మాట్లాడతా.. ఢిల్లీ స్థాయిలో ఒప్పందం కాంగ్రెస్, బీఆర్ఎస్లకు జరిగింది. రేవంత్ను సీఎంగా కొనసాగించాలని రాహుల్ కు ఇష్టం లేదని కేటీఆర్ అంటున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News