Wednesday, October 29, 2025
ePaper
Homeమెదక్‌Harish Rao | హరీష్‌రావుకి పితృవియోగం

Harish Rao | హరీష్‌రావుకి పితృవియోగం

మాజీ మంత్రి, సిద్దిపేట శాసన సభ్యుడు (Siddipet Mla) తన్నీరు హరీష్ రావు (Harish Rao) ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి సత్యనారాయణరావు (SatyanarayanRao) మంగళవారం కన్నుమూశారు. సత్యనారాయణరావు భౌతిక కాయాన్ని హైదరాబాద్‌లోని కోకాపేట క్రిన్స్ విల్లాస్‌లో ఉంచారు. అంత్యక్రియలను మంగళవారం మధ్యాహ్నం ఫిల్మ్ నగర్‌(Film Nagar)లోని మహాప్రస్థానం(Mahaprasthanam)లో నిర్వహిస్తామని చెప్పారు. సత్యనారాయణరావు మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

సత్యనారాయణరావు కేసీఆర్‌కి బావ. కేసీఆర్ 7వ సోదరి, అక్క లక్ష్మి భర్త. సత్యనారాయణరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. పుష్పాంజలి ఘటించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థించారు. హరీష్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో వచ్చి హరీష్‌రావు కుటుంబాన్ని పరామర్శించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News