Wednesday, February 11, 2026
Homeకరీంనగర్Sand | ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

Sand | ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

– కరీంనగర్ రూరల్ ఎస్ఐ నిరంజన్ రెడ్డి

కొత్తపల్లి: కరీంనగర్ రూరల్ మండలం పరిధిలోని గ్రామాల్లో పోలీసులు ఉదయం పెట్రోలింగ్ (Patrolling) నిర్వహించారు. ఈ క్రమంలో చేగుర్తి గ్రామానికి చెందిన చామనపల్లి బాబు, సిద్ధ రమేష్‌ అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు(Sand Transported Illegally). యజమాని కుర్ర రాజేశం ఆదేశాల మేరకు ఇలా చేశారు. మానేరు నది నుంచి ఇసుకను ట్రాక్టర్, ట్రైలర్లలో తరలిస్తుండగా పోలీసులు (Police) గమనించారు.

- Advertisement -

బొమ్మకల్‌లోని లారీ అసోసియేషన్ చౌరస్తా వద్ద పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు (Case Book) చేసి తదుపరి చర్యల నిమిత్తం కోర్టు(Court)కు పంపించారు. గతంలో ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేసి, మరోసారి ఇలాగే వ్యవహరిస్తూ పట్టుబడితే ట్రాక్టర్లు సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేస్తామని కరీంనగర్ రూరల్ ఎస్ఐ నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. నిందితులపై పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News