Monday, October 27, 2025
ePaper
Homeమేడ్చెల్‌Telangana Activist | భాస్కర్ యాదవ్ మృతి

Telangana Activist | భాస్కర్ యాదవ్ మృతి

గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడే క్రమంలో పలుమార్లు అరెస్ట్
కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన భాస్కర్ యాదవ్

మల్కాజిగిరి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం(Movement for a Separate Telangana State)లో క్రియాశీలకంగా వ్యవహరించిన జెనిగ భాస్కర్ యాదవ్ (55) సోమవారం తెల్లవారుజామున గుండెపోటు(Heart Attack)తో మృతి చెందారు. మల్కాజిగిరి నియోజకవర్గం వినాయక నగర్ డివిజన్‌కి చెందిన భాస్కర్ యాదవ్‌కు ఆదివారం రాత్రి ఛాతీలో నొప్పి (Chest Pain) రావడంతో కుటుంబ సభ్యులు ఈసీఐఎల్‌(Ecil)లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున చనిపోయినట్లు తెలిపారు.

భాస్కర్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో వినాయక్ నగర్ నుంచి క్రియాశీలకంగా వ్యవహరించారు. వివిధ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని పలుమార్లు అరెస్ట్ (Arrest) అయ్యారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో పనులు చేయలేని పరిస్థితిలో ఇంటికే పరిమితమయ్యారు. ఆయనకు ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. పలువురు తెలంగాణ ఉద్యమ నాయకులు భాస్కర్ యాదవ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కాకతీయ నగర్‌లోని యాదవ సంఘం స్మశాన వాటికలో సోమవారం అంత్యక్రియలు జరిగాయి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News