జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో నిర్వహించిన యూసుఫ్‌గూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నేతల భేటీలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే(Mla)లు ఈర్లపల్లి శంకర్, కసిరెడ్డి నారాయణ రెడ్డి, బత్తుల లక్ష్మా రెడ్డి, జయవీర్ రెడ్డి, బెల్లయ్య నాయక్, శివసేనా రెడ్డి, గిరిధర్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, లక్ష్మణ్ యాదవ్, ఝాన్సీ రెడ్డి, కుస్రు పాషా, సంజయ్ గౌడ్, డివిజన్ ప్రెసిడెంట్ ఫిరోజ్ ఖాన్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి (Congress Party Candidate) నవీన్ యాదవ్(Naveen Yadav)కు మద్దతుగా ప్రచారాన్ని మరింత వేగవంతం చేసేలా కార్యాచరణపై చర్చించారు. సీఎం రోడ్ షో(CM Road Show)తో మరింత జోష్ నింపేలా ప్లాన్ వేశారు. యూసుఫ్‌గూడ డివిజన్‌లోని ప్రతి కాలనీలో డోర్ టూ డోర్ ప్రచారం చేస్తూ ప్రజా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుస్తుందనే ఉత్సాహాన్ని లోకల్ క్యాడర్(Local Cadre)లో మరింత నింపాలని సూచించారు.
ప్రతి 100 ఓట్లకు ఒక ఇన్‌ఛార్జ్‌ని ఏర్పాటుచేసుకొని పోలింగ్ రోజు ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటేసేలా చూడాలని కోరారు. పోలింగ్ శాతాన్ని పెంచేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని అభిప్రాయపడ్డారు. యూసుఫ్‌గూడ డివిజన్‌లో భారీ మెజారిటీ వచ్చేలా చూడాలని నిర్ణయించారు.
