మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, కీసర
కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం కీసరగుట్టలో కొలువైయున్న శ్రీ భవాని సహిత రామలింగేశ్వర స్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకొని స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
