చిలిపిచేడ్,ఆదాబ్ హైదరాబాద్
భక్తులు పరమ పవిత్రంగా భావించే కార్తీకమాసం తొలి సోమవారం(monday) సందర్భగా చిలిపిచేడ్ మండలంలోని ఫైజాబాద్ గ్రామంలో గల హనుమాన్ ఆలయంలో ఉన్న శివ లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్తీకమాసాన్ని పురస్కరించుకొని చాలామంది భక్తులు శివలింగానికి తెల్లవారు జామునే ఉదయం 4గంటల నుండే లింగానికి అభిషేకం,ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఈ కార్తీక మాసం తమకెంతో ప్రత్యేకమైనదిగా తెలిపారు.కార్తీకమాసం మొదలుకొని చివరివరకు నిత్యం గ్రామంలోని ఉన్న శివలింగానికి అభిషేకం చేయడం,ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం వలన తమకెంతో ముక్తి లభిస్తుందన్నారు.గ్రామంలోని ప్రజలు,పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని ప్రతియేటా ఆ పరమశివుడి ఆరాధిస్తామని వారు తెలిపారు…
