మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కూలిపోతుందని మాజీ ఎమ్మెల్సీ (Ex Mlc) కపిలవాయి దిలీప్ కుమార్ (Kapilavai Dilip Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy Revanth Reddy) సర్కారును కూల్చనున్నాడని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో 30, 40 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) దగ్గర డబ్బులు అయిపోయాయని, ఆయన ఇంక ఇంట్లో కూర్చోవడం మంచిదని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
