ప్రధాని మోదీ (PM Modi) ప్రతి నెలా చివరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి ఆలిండియా రేడియో(AIR)లో చేసే ప్రసంగం ‘మన్ కీ బాత్’ (Mann ki baat) 127వ ఎపిసోడ్ అక్టోబర్ 26న ప్రసారమైంది. ఇందులో ఆయన జీఎస్టీ (GST) మార్పులు-వాటి ఫలితాలపై మాట్లాడారు. వంట నూనె (Cooking Oil) వాడకాన్ని 10 శాతం తగ్గించాలని కోరుతూ రాసిన లెటర్‌కి సానుకూల స్పందన వచ్చినట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ మునిసిపల్ కార్పొరేషన్ (Ambikapur Municipal Corporation) నిర్వహిస్తున్న గార్బేజ్ కేఫ్ (Garbage Cafe) పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతోందని పేర్కొన్నారు. అక్కడ కేజీ ప్లాస్టిక్ వ్యర్థాలను ఇస్తే ఫుల్ మీల్స్ పెడతారని, అర కేజీ ఇస్తే టిఫిన్ తినొచ్చని వివరించారు. తెలంగాణ పోరాట యోధుడు కుమురం భీమ్ (Kumuram Bheem) గురించి గొప్పగా వెల్లడించారు.
