నేను దేవుణ్ణి(God), ఈ విశ్వపు (Universe) మూల సత్యాన్ని, మీ ఆత్మల్లో వెలిగే శాశ్వతమైన జ్యోతి(Light)ని. మీరంతా నా సంతానమే, నా రూపురేఖలే, మరి నా పేరిట ఎందుకీ కుల(Caste), మత (Religion) వైషమ్యాల రేఖలు? రాజకీయ నాయకుల(Political Leaders)కు పదునైన ప్రశ్న. ఓ స్వార్థపు రాజకీయ నాటక సూత్రధారులారా నా భక్తుల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకునే వారలారా! నేను ఎప్పుడైనా చెప్పానా ‘కులం కంచె కట్టండి’ అని? నేను ఎప్పుడైనా ఆదేశించానా ‘మతం పేరిట మానవత్వం చంపండి’ అని? నా మందిరం ప్రేమకు, కరుణకు పుట్టినిల్లు, మీరు దాన్ని ద్వేషానికి, విభజనకు వేదిక చేశారు. మీ అధికారం కోసం, ఓటు బ్యాంకు (Vote Bank) కోసం, నా పవిత్ర నామాన్ని అబద్ధపు ఆయుధంగా మార్చారు. సాటి మనిషిని మనిషిగా చూడలేని కులం, అది నా సృష్టిలో లేని మీ మానవ కల్పిత కాలుష్యం.
- సౌరం జితేందర్
